రామోజీరావు అక్షర యోధుడు - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

bsbnews
0


                                                                                                                                                          

 రామోజీరావు అక్షర యోధుడు - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

 

BSBNEWS - KANDUKUR

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు కందుకూరు తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పించింది. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రిక, చానల్స్ ద్వారా కోట్లమందిలో చైతన్యాన్ని నింపి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదలను, బాధితులను ఆదుకోవడంలో రామోజీరావు ముందు నిలిచారని, తెలుగు భాషను పరిరక్షించడంలో ఎనలేని సేవ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, ఇంకా పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Post a Comment

0Comments
Post a Comment (0)