గంధమహోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

 గంధమహోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరరావు


BSBNEWS - KANDUKUR

కందుకూరు మున్సిపాలిటీ, 11వవార్డు శామీరపాలెంలో, శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని 42వ గంధమహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్స వానికి కందుకూరు ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా గ్రామస్తులు నాగేశ్వరరావుని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. గంధమహోత్సవ వేడుకలను చూసేందుకు కందుకూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.                                                                        

 అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ

గ్రామంలోహిందూముస్లింల ఐక్యత చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని, ఈ ఆత్మీయ బంధం ఇలాగే కొనసాగాలన్నారు. ఇటీవల ఎన్నికల్లో చెడును పారద్రోలి, మంచిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే, ఇచ్చిన మాటకు కట్టుబడి 16 వేలకు పైగా టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారన్నారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో లేకుండా చేశారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా సేవచేసే అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని, 24 గంటలు ప్రజల కోసం కష్టపడతాను అని, ప్రజల కరతాళధ్వనుల మధ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, షేక్ షరీఫ్, మునీర్, సుభాని, కాలేషా, మహబూబ్ బాషా, పువ్వాడి రామ్మూర్తి, ముప్పరాజు కృష్ణారావు, తల్లపనేని రవి, కండ్రా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.  


Post a Comment

0Comments
Post a Comment (0)