అనదికార పొగాకు బారన్ లు నిర్మించటం నేరం -యం. లక్ష్మణ రావు
BSBNEWS - KANDUKUR
రైతు సోదరులు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని అనదికార బారన్ లు పొగాకు బోర్డు అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, అలా నిర్మించడం పొగాకు బోర్డు చట్ట ప్రకారం నేరమని పొగాకు బోర్డు రీజినల్ ఒంగోలు మేనేజర్ యం. లక్ష్మణ రావు తెలియ చేసారు. అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని 27 వ వేలం కేంద్రంను పొగాకు బోర్డు రీజినల్ ఒంగోలు మేనేజర్ యం. లక్ష్మణ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు సూర ముక్క వేలంను పరిశీలించారు. కంపనీ వారిని పొగాకు సూర ముక్క కు మంచి ధరలు ఇవ్వాలని కోరారు. అనంతరం వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతు సోదరులు పొగాకు సూర, ముక్క లో తేమ వేడి లేకుండా మంచి గా మార్కెట్ కు తెచ్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని పొలాలు, బారన్ లు అధిక ధరలకు లీసుకు తీసుకోవద్దని తెలియ చేసారు. అలా చేయడం వలన భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ విధిగా పచ్చి రొట్ట ఎరువులు విత్తనాలు చల్లాలని దీనివలన నేల సారవంతం అవడమే కాకుండా మంచి నాణ్యమైన పొగాకు పండుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పొగాకు బోర్డు 27 వేలం నిర్వహణ అధికారి కె. రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.