చేగువేరా స్ఫూర్తి నేటికి అనుసరణీయమే

bsbnews
0

 చేగువేరా స్ఫూర్తి నేటికి అనుసరణీయమే 

BSBNEWS - KANDUKUR




రచయిత, వైద్యుడు,మేధావి, విప్లవకారుడు, గెరిల్లా పోరాట సిద్ధాంత రూపకర్త,క్యూబన్ విప్లవోద్యమంలో పనిచేసి ప్రపంచవ్యాప్తంగా విప్లవ భావాలను, విప్లవ సంస్కృతిని విస్తృతంగా వ్యాప్తి చేసిన యోధుడు చేగువేరా స్ఫూర్తి నేటికి అనుసరణీయమేనని పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముపోవర్ కిషోర్ అన్నారు. స్థానిక కోటారెడ్డి భవన్ పైన బుద్ధ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో చేగువేరా 96వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా పాలపిట్ట దీర్ఘకావ్య రచయిత ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ చేగువేరా విద్యార్థి దశలోనే లాటిన్ అమెరికా అంత పర్యటించి పేదలు వారి కష్టాలను, వారి జీవితాలను చూసి చలించిపోయి  సమ సమాజం వైపు అడుగులు వేశాడన్నారు. పెట్టుబడిదారీ దోపిడి విధానం, వలసవాదం, సామ్రాజ్యవాద దౌర్జన్యాలు ఫలితమే పేదరికం,జాతుల మధ్య వివక్షతలు, ప్రజల మధ్య అంతరాలుగా ఉన్నాయని భావించి పేదల విముక్తి కోసం వారి పక్షాన పోరాడాడన్నారు. నైపుణ్యం గల రచయితగా ఎన్నో రచనలు చేశారని తెలిపారు.


ముఖ్యంగా ది మోటార్ సైకిల్ డైరీస్, చేగువేరా టాక్స్ టు యంగ్ పీపుల్స్, రెవల్యూషనరీ హ్యూమనిస్ట్ అప్రోచ్ టు మార్క్సిస్ట్ ఎకనామిక్స్, చేగువేరా అన్ గ్లోబల్ జస్టిస్ లాంటి ప్రముఖ గ్రంథాలను తన కలము నుండి వెలువరించారు అని అన్నారు. దమ్మ చక్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపాసకులు గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ  చేగువేరా చూపిన సామాజిక న్యాయ దృక్పథం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇది దిక్చూచిగా ఏర్పడిందని అని అన్నారు. సమ సమాజ స్థాపనకు చేగువేరా స్ఫూర్తి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి  చనమాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రఖ్యాత టైం మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది అతి ప్రభావంతమైన వ్యక్తులలో ఒక్కరిగా చేగువేరాను పేర్కొంది అని అన్నారు. ఏ న్యూ సొసైటీ రిఫ్లెక్షన్స్ ఫర్ టుడేస్ వరల్డ్ పుస్తకములో తన భావాలను విస్తృత పరిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీడిత వర్గానికి సమ సమాజ సందేశం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో యానాది సంక్షేమ సంఘం ప్రకాశం, నెల్లూరు సంయుక్త జిల్లాల ఉపాధ్యక్షుడు చేవూరు దుర్గాప్రసాద్, బహుజన నాయకుడు ముతకాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)