యువత భవిత తెలుగుదేశం తోనే - అనుమోలు సాంబశివరావు
BSBNEWS - పొన్నలూరు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగాడీఎస్సీపై చేస్తూ యువత భవితకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతకు అద్దం పడుతుందని మండల టిడిపి అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు అన్నారు. మండల కేంద్రమైన పొన్నలూరు లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఆర్ఆర్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తో పాటు మెగా డీఎస్సీ పెడతానని దొంగ హామీలు ఇచ్చి మాట తప్పారని అన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా 7500 పోస్టులు ప్రకటించడం తప్ప యువతకు చేసింది ఏమీ లేదని, కానీ చంద్రబాబు నాయుడు ఆ పోస్టులకు రెట్టింపుగా 16,347 డిఎస్సి పోస్టులతో ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలిచారని కొనియాడారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం, వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు చేస్తూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ లు పునరుద్ధరణ చేస్తూ నాలుగో సంతకం, హిల్స్ సెన్సెస్ గణనపై ఐదవ సంతకం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మండల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు గుమ్మల వెంకట్రావు, సన్నమూరి నరసింహారావు, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.