తన ఉద్యమాలతో అందరికీ కమ్యూనిస్టు యోధుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి సుదర్సి పాలస్ - సిపిఐ కార్యదర్శి సురేష్ బాబు

bsbnews
0

 సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా ఉద్యమ తార సుదర్శ పాలస్ వర్ధంతి
 
 


BSBNEWS - KANDUKUR

 

తుది శ్వాస వరకు నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, బలహీనవర్గాల హక్కుల సాధన, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించిన ఉద్యమ నేత పాలస్ అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో కందుకూరు ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమంలో నిరంతరం తన ఉద్యమాలతో అందరికీ కమ్యూనిస్టు యోధుడిగా ప్రసిద్ధిగాంచిన సుదర్సి పాలస్ 8వ వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి సురేష్ బాబుతో పాటు సిపిఐ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులతో పాటు లాల్ సలాం లు అర్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల్లో జన్మించి తన వర్గాల ప్రజలు తమ హక్కుల సాధన కోసం నిరంతరం అవమానాలు, దాడులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను నేరుగా గుర్తించి విద్యార్థి ఉద్యమంలోనే నిరంతరం ప్రజల పక్షాన ఉద్యమించి ఐదు దశాబ్దాలకితమే ఎంఏ లిటరేచర్ విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగం లభించినా వద్దని శ్రీకాకుళ ఉద్యమ ప్రారంభంలో ప్రారంభనేతగా ఉండి శ్రీకాకుళ ఉద్యమాన్ని ఉరక లెక్కించిన మహనీయుడు పాలస్ అని అన్నారు. అనంతరం కందుకూరు ప్రాంతంలో నిర్భవి పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పేద వర్గాల బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తును అందించిన పేదల పక్షపాతి అని కొనియాడారు. తదుపరి కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై నాంచారమ్మ కాలనీలో పేద వర్గాల నివేశన స్థలాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఉద్యమ నేత పాలస్ అని అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఏర్పాటుకు ముందున్న నాయకుడు ఆయన అని అన్నారు. ఆస్తులు ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉన్నా లేకున్నా తుది శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమంలో నిబద్దత కలిగిన నాయకునిగా కందుకూరు ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ముందుండి ఉద్యమం నడిపించిన ఉద్యమ తార పాలస్ అని అన్నారు. అలాంటి కమ్యూనిస్టు యోధుని ఉద్యమ స్ఫూర్తి నేటి తరం కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా యువ కమ్యూనిస్టులకు ఆదర్శం, స్ఫూర్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తితో నిరంతర ఉద్యమాలతో బడుగు,బలహీన వర్గాలు, పేదలు, కార్మిక, కర్షక, రైతు కూలీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని కమ్యూనిస్టులు యువతరం నేతలు ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఎంతనేనా ఉందని ఆయన అందించిన పోరాట స్ఫూర్తి మన అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష, కార్యదర్శులు మురళి, ఆనందమోహన్, రాము, బాల బ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)