నీట్ పేపర్ లీకేజీల నిర్లక్ష్యానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
నీట్ పరీక్షా ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలి...AISF - AIYF డిమాండ్
శ్రీకాకుళం
BSBNEWS - SRIKAKULAM
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF), అఖిలభారత యువజన సమాఖ్య ( AIYF) ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణ కేంద్రం అరసవెల్లి జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన NEET పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించి రావడం వెనుక బీహార్ కు చెందిన ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 30 లక్షలు వసూలు చేసి దొరికిన కూడా వారిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది ప్రతిభ గల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారన్నారు .ఈ విద్యా సంవత్సరం ఎన్టిఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై , పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యుజిసి నెట్ పేపర్ లీకేజీ అయిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు రద్దు చేశారని నీట్ పేపర్ ఎందుకు రద్దు చేయరో 24 లక్షల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని కోరారు . గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని 24 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని లేనిపక్షంలో వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులు కిరణ్ కుమార్, చందు , సాయి, ప్రదీప్ విద్యార్థులు పాల్గొన్నారు