అభయాంజనేయ స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఇంటూరి

0

 అభయాంజనేయ స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఇంటూరి 






BSBNEWS - వలేటివారిపాలెం

వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి తిరునాళ్ల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ప్రభ పై, నాగేశ్వరరావుని గ్రామస్తులు సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తోట అంజమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు విజయసారథి, పార్టీ నాయకులు అత్తోట వెంకటేశ్వర్లు, కొత్త మాధవరావు, లక్ష్మీనరసింహం, తెలుగుయువత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)