100 రోజుల్లో మన మంచి ప్రభుత్వం
BSBNEWS - ULAVAPADU [20/09/24]
వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తోంది అని, పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగిందని, డీఎస్సీ ప్రకటించి 16 వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గం లోని ఉరవపాడు మండలం కరేడు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించారు.
ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే పేదల కడుపులు నింపుతున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు కూడా అమల్లోకి రాబోతున్నాయన్నాయని తెలిపారు.
గత ప్రభుత్వం పంచాయతీలను నిర్జీవంగా మార్చి వేలకోట్లు దారి మళ్లించి, సర్పంచులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్నాళ్లు పొందుతూ ముందు సాగుతుందన్నారు.2014-19 మధ్య పల్లెల రూపురేఖలను నారా లోకేష్ ఎలా మార్చారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీలకు ప్రాణం పోసి వెలుగులు నింపబోతున్నారన్నారు. విజయవాడకు వరదలు వస్తే, ఏడుపదుల వయసులో చంద్రబాబు ఎంత కష్టపడ్డారో మనమందరం చూసామని, ఆయన ముందుచూపు, విజనరీ వల్లే బాధితులు త్వరగా కోలుకున్నారు. నాతో సహా అనేకమంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు విజయవాడ వెళ్లి పది రోజులపాటు బాధితులకు అండగా నిలిచామని, చంద్రబాబు వచ్చిన దగ్గరనుంచి రాష్ట్ర ప్రజల గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారని అన్నారు. కొత్తపల్లెపాలెంలో ఇళ్ల స్థలాల సమస్య ఉంది అని, త్వరలో భూమి కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.రెవిన్యూ, విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామనని, రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ పరిశ్రమ పనులు పూర్తయ్యాక ఈ ప్రాంత వాసులకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
స్థానికులకే 90% ఉద్యోగాలు లభించేలా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
ఏ నమ్మకంతో మీరు నాకు ఓట్లు వేసి గెలిపించారో, ఈ ఐదేళ్లు పరిపాలన చేసి ఆ నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానన్నారు.
ముఖ్యంగా మత్స్యకారులు కూటమికి అండగా నిలిచారని, నా గెలుపులో మత్స్యకారుల పాత్ర ఎంతో ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో, ఈ గ్రామంలో అనేకమందిపై అక్రమంగా కేసులు పెట్టారని, రెవిన్యూ సమస్యలు సృష్టించారని, ఐదేళ్లలో బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.