100 రోజుల్లోనే ప్రజల చేత శభాష్ అనిపించుకున్న ప్రభుత్వం - ఇంటూరి నాగేశ్వరరావు

bsbnews
0

 100 రోజుల్లోనే ప్రజల చేత శభాష్ అనిపించుకున్న ప్రభుత్వం - ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని కలవళ్ళ గ్రామంలో వంద రోజుల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వివరించేందుకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల్లో అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అతికించారు. సచివాలయం దగ్గర మొక్కలు నాటారు. గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యేకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఆయనపై పూలు చల్లుతూ, మేళతాళాలతో అట్టహాసంగా గ్రామంలోకి ప్రజలు తీసుకువెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు.అనంతరం ప్రజావేదికపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 250 రూపాయల చొప్పున పింఛన్ పెంచితే, కూటమి ప్రభుత్వం ఒకేసారి వెయ్యి పెంచిందని చెప్పారు. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం, 16 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణ పరిమితిని 10 లక్షలకు పెంచడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్ కార్డులు ఇష్టం వచ్చినట్టుగా తీసేశారని, టిడిపి నేతల బిల్లులు నిలిపివేశారని, ఇంకా రెవిన్యూ పరంగా అనేక ఇబ్బందులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్షపూరిత చర్యలు లేకుండా పాలన చేస్తున్నామని వివరించారు. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన రోడ్లను బాగు చేస్తున్నామని, నియోజకవర్గంలో త్వరలో 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల పనులు మొదలు కాబోతున్నాయని చెప్పారు. జగనన్న కాలనీలు వైసీపీ నేతల జేబులు నింపడానికి తప్ప పేదలకు పనికి రాలేదని ఆయన విమర్శించారు. మట్టి తోలకం, లెవెలింగ్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. వాటికి భిన్నంగా తమ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన ఉంటుందని చెప్పారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా, కార్యక్రమం పోస్టర్ ను ప్రజావేదికపై ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వ్యవసాయం లాభసాటిగా మార్చుకునే విధంగా, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ, ఆధునిక పరికరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. రైతులందరూ ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలని రైతులకు సూచించారు. ప్రజలను పదేపదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని, అర్జీలు పెండింగ్ లో ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషుబాబు, ఎమ్మార్వో ఎస్.కె అబ్దుల్ హమీద్, వ్యవసాయ శాఖ ఏడిఏ పి.అనసూర్య, ఏవో హేమంత్ భరత్ కుమార్, విద్యుత్ శాఖ టి.మధుబాబు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ శిరీష, మండల ఏపీఓ ఉమామహేశ్వరరావు, పశువైద్యాధికారి పి.వంశీ, హౌసింగ్ ఏఈ జె.వెంకట శ్రీనాథ్, మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామపార్టీ అధ్యక్షుడు స్వర్ణ చిన నాంచారయ్య,  ఉపసర్పంచ్ జడ అనిల్, టిడిపి నేతలు మోదేపల్లి లక్ష్మీనారాయణ, మోదేపల్లి నారాయణ, మోదేపల్లి వెంకట నరసింహం, , మన్నం అయ్యపనాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ ఘట్టమనేని లక్ష్మీనరసింహం, మండల ప్రధాన కార్యదర్శి గురజాల బెంజిమెన్, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీ  నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)