వరద బాధితులకు లారీ ఓనర్స్ అసోసియేషన్ 1,01,116/- విరాళం
BSBNEWS - KANDUKUR [23/09/24]
కందుకూరు పట్టణంలోని, ది స్కందపురి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల విరాళాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కు అందించారు. లారీ యజమానుల ఆహ్వానం మేరకు, ఆదివారం రాత్రి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన అనంతరం, విరాళాన్ని ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితుల కోసం ఎంతోమంది ఉదారంగా వస్తువులు, నగదు రూపేణా విరాళాలు అందించి పెద్దమనసు చాటుకున్నారని అన్నారు. వరద తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితిలు నెలకొనేంతవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుండవరపు పెదశేషయ్య, ప్రెసిడెంట్ కంచర్ల మాధవరావు, సెక్రటరీ మందలపు గోపి, తదితరులు పాల్గొన్నారు.