ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 అర్జీలు
BSBNEWS - KANDUKUR [30/09/24]
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 అర్జీలు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ కె అనూష అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్య సమస్యలు ఏ ఇతర సమస్యల పైన 9177700267 నెంబర్కు ఫోను ద్వారా సమస్యలు తెలుపవచ్చునని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని సెక్షన్ హెడ్స్ లు పాల్గొన్నారు.