వరద బాధితుల కోసం 2.25 లక్షల విరాళం ఎమ్మెల్యే చేతికి అందజేత

0

 వరద బాధితుల కోసం 2.25 లక్షల విరాళం ఎమ్మెల్యే చేతికి అందజేత

BSBNEWS - KANDUKUR [14/9/24] 


విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు కందుకూరు డివిజన్ టీచర్స్ గ్రూప్ ముందుకొచ్చింది. గ్రూప్ సభ్యులైన పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కలిసి 2.25 లక్షల రూపాయల విరాళాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారని అన్నారు. వరద బాధితులు త్వరగా కోలుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు, కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు రేయింబవళ్లు ఎంతో కష్టపడి బాధితులకు సేవలు అందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో సహాయం చేయాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తోటి వారికోసం మనం ఎంత సేవ చేస్తే, దేవుడు కూడా మనకు మేలు చేస్తాడని అన్నారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లపనేని శ్రీను, దామా కొండపనాయుడు, ఏలూరి చినబ్రహ్మయ్య, ఆరెబోయిన వెంకటేశ్వర్లు, గొర్రెపాటి మధు, వలేటి రవి, ఉన్నం వెంకటరావు, పాలకీర్తి వెంకయ్య, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి దామా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)