వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో 39 మంది విద్యార్ధిని, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
BSBNEWS - KANDUKUR [30/09/24]
స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 39 విద్యార్థిని విద్యార్థులకు వరల్డ్ విజన్ మేనేజర్ యాషియా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా కందుకూరు మున్సిపల్ కమిషనర్ కే అనూష పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు సులువుగా ఉండేందుకు సైకిళ్ళను వరల్డ్ విజన్ వారు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారు అందించిన సైకిలను ఉపయోగించి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఆశించారు. వరల్డ్ విజన్ మేనేజర్ యాషియ మాట్లాడుతూ వరల్డ్ విజన్ సిబ్బంది ద్వారా మండల పరిధిలో చదువుకునే విద్యార్థులు తమ గ్రామాల నుండి పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న 26 మంది బాలికలకు 16 మంది బాలురులకు మొత్తం 39 మంది విద్యార్థులు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. వరల్డ్ ఇజం సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ సైకిళ్ళ ను పంపిణీ చేయడం జరుగుతుంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ఎంఈఓ టు సుబ్బారెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, వరల్డ్ విజన్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.