వరద బాధితుల కోసం 4.5 లక్షల విరాళం ఎమ్మెల్యే చేతికి అందజేత

bsbnews
0

 వరద బాధితుల కోసం 4.5 లక్షల విరాళం ఎమ్మెల్యే చేతికి అందజేత

BSBNEWS - KANDUKUR [18/09/24] 

కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి పిలుపుతో  విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు నాయకులు, కాంట్రాక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు విరాళాలు అందిస్తున్నారు. కందుకూరులోని OXFORD విద్యాసంస్థల మేనేజ్ మెంట్, టీచర్లు, విద్యార్థులు కలిపి 2,76,063 రూపాయలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఈరోజు  అందజేశారు. కొంతమంది విద్యార్థులు తమ పాకెట్ మనీని  విరాళంగా ఇచ్చారని విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ వివరించగా ఆ చిన్నారులను ఎమ్మెల్యే పలకరించి మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు.గుర్రంవారిపాలెంకు చెందిన టిడిపి నాయకుడు దామా వెంకటేశ్వర్లు లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు. అలాగే కందుకూరు మండలం పందలపాడు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రామాల వెంకటకృష్ణారెడ్డి 50వేలు, కందుకూరు పట్టణానికి చెందిన సత్యసాయి జ్యుయెలర్స్ అధినేత కాకుమాని ప్రవీణ్ కుమార్ 25 వేల రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద మనసుతో వరద బాధితులకు సాయమందిస్తున్న దాతలందరికీ అభినందనలు తెలిపారు. బాధితుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ పరిహారం ప్రకటించి వారిని ఆదుకుంటున్నారని అన్నారు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, మన రాష్ట్రానికి గొప్పవరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు బాలభాస్కర్, నరేంద్ర, డీన్ మందలపు రామారావు, ప్రిన్సిపల్స్ నజీర్, మల్లికార్జున,  ఇంకా ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఆర్యవైశ్య ప్రముఖులు మురారి శెట్టి సుధీర్, చక్కా వెంకట కేశవరావు, కోట కిషోర్, గొత్తుల బాలాజీ, పువ్వాడి నరసింగరావు, తాతా లక్ష్మీనారాయణ, కంకణాల వెంకటేశ్వర్లు, చలంచర్ల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)