ఎమ్మెల్యేకు 48.396 రూపాయలు విరాళం అందజేసిన టిఆర్ఆర్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం
BSBNEWS - KANDUKUR [27/09/24]
విజయవాడ బాధితుల సహాయార్థం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు 48.396 రూపాయలు విరాళం అందజేసినట్లు పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాల తరఫున 48 వేల 396 రూపాయలు, అధ్యాపక బృందం ఒకరోజు వేతనం 28,224 రూపాయలు మొత్తము కలిపి 76,620 రూపాయలు వరద బాధితుల సహాయార్థం పంపించటం జరిగినదన్నారు. దాంతో పాటు కళాశాల జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులు కందుకూరు పుర ప్రజల నుండి 22,896 రూపాయలు విరాళాలు సేకరించటం జరిగినది అదేవిధంగా కళాశాలలోని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఒకరోజు వేతనము కాకుండా అదనముగా 13800, విద్యార్థిని విద్యార్థులు వారి సొంత ఖర్చులు మానుకొని 11700 సమకూర్చబడినవి మొత్తము లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి వరద బాధితుల సహాయార్థము సీఎం రిలీఫ్ ఫండ్ కి 48 వేల 396 రూపాయలు చెక్కును అధ్యాపక బృందముతో కలిపి అందించటం జరిగినదన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి సుబ్బారావు, చుండూరి బాబురావు, కాశీరత్నం, కట్టా సుబ్బారావు, నరసింహారావు, రాజశేఖర్, హజరత్తయ్య, ఉష, శివకుమారికేథరిన్, మేరీ గ్రేస్, శేషగిరిరావు, రాజులు పాల్గొన్నారు