ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 8 అర్జీలు

bsbnews
0

 ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 8 అర్జీలు

BSBNEWS - KANDUKUR [23/09/24] 

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంకు 8 అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ కే అనూష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలను త్వరతిగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ద్వారా అర్జీల రూపంలో అందిస్తే వాటి సమస్యలు పరిష్కరించబడతాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. కార్యాలయానికి రాలేని వారు డయల్ యువర్ కమిషనర్ 9177700267 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ హెడ్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)