ఎమ్మెల్యేకు 93,396/- రూపాయల విరాళాలు అందజేత
BSBNEWS - KANDUKUR [27/09/24]
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపుతో విజయవాడ వరద బాధితులకు తమవంతుగా పలువురు సాయం చేస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. పట్టణంలోని టి ఆర్ ఆర్ జూనియర్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి 48,396/- చెక్కును వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకి శుక్రవారం అందజేశారు. బద్దిపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ చేజర్ల శ్రీనివాసులు రెడ్డి - 10,000/-రూపాయలు,కందుకూరు పట్టణానికి చెందిన పిరతల బాలాజీ 10,000/-రూపాయలు, పువ్వాడి రమేష్ 5,000/-రూపాయలు, పువ్వాడి నరసింగరావు 5,000/- రూపాయలు, మాదాల మాల్యాద్రి 5,000/-రూపాయలు, గనిపినేని వెంకటరావు 5,000/- రూపాయలు మొత్తంగా 93,396/- రూపాయలు విరాళాలను దాతలు అందజేయడం జరిగింది.వీరందరినీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య తదితరులు పాల్గొన్నారు.