టి ఆర్ ఆర్ లో విద్యార్థులకు అవగాహన
BSBNEWS - KANDUKUR [26.09.2024]
కందుకూరులోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ మీద విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుస్తకంలో ఉండే పాఠాలు అధ్యాపకులమైన మేము చెప్తాం అని, కానీ జీవితం అనే పాఠాన్ని చదివి ఆచరించి అతి సామాన్యమైన రైతు బిడ్డ నుండి అసాధారణమైన స్థాయికి చేరుకున్న వ్యక్తి వల్లూరి వెంకటేశ్వరరావు అని అన్నారు. ప్రముఖ మెంటర్, పర్సనాలిటీ డెవలపర్, కెరీర్ గైడెన్స్ లు, మూడు గుణాలు కలిగిన ఏకైక వ్యక్తి వల్లూరి వెంకటేశ్వరరావు అని తెలిపారు. వల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేను హైదరాబాదులోని సినీ ప్రముఖులైనటువంటి చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, తేజ వంటి వ్యక్తులకు సలహాదారుడి గాను అభ్యసన అనుభవాలు నేర్పినటువంటి వ్యక్తిగాను అన్నిచోట్ల సుపరిచితున్ని అని తెలిపి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు వెంకటేశ్వరరావు మాట్లాడే మాటలు ఆసక్తికరంగా విన్నారు. వాటిలో కాకు నేటివ్ స్కిల్స్.సెల్ఫోన్ ఫోర్ మెంట్స్, లెర్నింగ్ క్రియేటివ్, నాలెడ్జి, చాలా విషయాలు తెలిపారు. నేనేంటి నాకేంటి నీకేంటి అనే మూడు అంశాల మీద నలు చెరువుల చుట్టూ ఈ మూడు అంశాలను పిల్లల మనసులో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. మనం ఎలా ఉండాలి తల్లిదండ్రుల తోటి ఉపాధ్యాయుల తోటి సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాల మీద విద్యార్థులతో కులం కుశంగా చర్చించారు. 100 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను అతను స్వయంగా అతని డబ్బుల తోటి చార్టెడ్ అకౌంటెన్సీ( సిఏ) చేయించటానికి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాను అని తెలిపారు. మన కళాశాలలోనే బాగా చదువుకొని వంద మంది విద్యార్థులు ఎంపికై విధంగా మీరు కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో తొట్టెంపూడి సుబ్బారావు, మస్తాన్వలి , పరుచూరి ఉష, సీతారామమ్మ, చుండూరి బాబురావు, భాస్కరరావు, నరసింహారావు, హజరత్తయ్య, కట్ట సుబ్బారావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు