ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి
పట్టణ ఎస్సై సాంబయ్య శివయ్య
BSBNEWS - KANDUKUR [23/09/24]
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను విధిగా పాటించాలని, వాహనాలు మీద పరిమితికి మించి ప్రయాణం చేయడం నేరమని, అది ప్రమాదాలకు దారితీస్తుందని కందుకూరు పట్టణ ఎస్సై సాంబయ్య అన్నారు. సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ కూడలి లో పలు ద్విచక్ర వాహనాలను ఆయన తనిఖీ చేశారు. త్రిబుల్ రైడింగ్ చేసేవారికి ఫైన్లు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎడ్వర్డ్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.