పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కమీషనర్ కె. అనూష

0

 పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కమీషనర్   కె. అనూష

BSBNEWS - KANDUKUR [14/9/24] 

కందుకూరు మున్సిపాలిటీలో పారిశుద్యంపై మున్సిపల్ కమీషనర్ కె. అనూష ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పారిశుద్ధ ఈ కార్యక్రమాలు శనివారం చేపట్టారు. మున్సిపాలిటీ పరిధి లోని పడమట వడ్డె పాలెం, పోతురాజుమిట్ట, ఏకలవ్య నగర్, కోటకట్ట ఏరియాలలో మురుగు కాలవలు శుభ్రం చేయించి చెత్త పోగులు ట్రాక్టర్ల ద్వారా తీయించారు. దోమల లార్వా నిర్మూలన మందును కాలవలలో స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తడి చెత్తను పొడి చెత్త వేరే వేరుగా చేసే రెండవ వద్దకు వచ్చే పారిశుద్ధ కార్మికులకు అందించి వారికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోశానిటరీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)