స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

 స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - ULAVAPADU [17/09/24]  

స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే, గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. పారిశుద్ధంపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అధికారులు, కార్మికులు పారిశుధ్య నిర్వహణపై బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధులు పొంచి ఉంటాయని, అవి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రతి పంచాయతీకి ఇటీవల విడుదలైన ఆర్థిక సంఘం నిధులను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు పెట్టుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు.  మొదట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి, అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా నిలబడ్డారు. పరిసరాలు పరిశుభ్రతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో N.విజయ, ఎంఈఓ శివనాగేశ్వరరావు, సర్పంచ్ నాగలక్ష్మి, కార్యదర్శి విజయమ్మ, సిడిపిఓ అరుణ, మండల టిడిపి అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీను, ఉలవపాడు గ్రామ టిడిపి అధ్యక్షుడు అంచుపోగు వాసు, మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు సన్నెబోయిన ప్రభావతి, మండల తెలుగు యువత అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి, పార్టీ నాయకులు చింతల సింగయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రావినూతల రమేష్, బడితల శివప్రసాద్, సాంబమూర్తి, అమ్మనబ్రోలు శివ, శ్రీహరి చిరితోటి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)