సంపూర్ణ పౌష్టికాహారము-చక్కని ఆరోగ్యం - బత్తుల పద్మావతి

bsbnews
0

 సంపూర్ణ పౌష్టికాహారము-చక్కని ఆరోగ్యం -బత్తుల పద్మావతి

BSBNEWS - KANDUKUR [19/09/24] 

సంపూర్ణ పౌష్టికాహారము-చక్కని ఆరోగ్యం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు బత్తుల పద్మావతి అన్నారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ నందు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, వరల్డ్ విజన్ స్వచ్చంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సీడీపీఓ కె. శర్మిష్ట అధ్యక్షతన పౌష్టికాహార మాసోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు బత్తుల పద్మావతి మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల కమీషన్ ఆదేశాలను అనుసరించి పౌష్టికాహార మాసోత్సవాలు సెప్టెంబర్ 1 నుండి 30 వరకుదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కందుకూరులో జరుపుకోవడం జరిగిందన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2018 వ సంవత్సరములో రాజస్థాన్ లో ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జరుపుకుంటున్న పౌష్టికాహార మాసోత్సవాలు పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని, ముఖ్యంగా బాల్యం అంగన్వాడి కేంద్రాల్లో ప్రారంభమవుతుందని అన్నారు. పిల్లలకి చక్కని ప్రవర్తనతో కూడిన నడవడికను నేర్పడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందిస్తూ వారి మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడాలని చెప్పారు.బాలింతలలో రక్తహీనత, పిల్లలలో పోషకాహార లోపం ప్రధాన సమస్యలుగా ఉన్నదని అన్నారు. రక్తహీనత నుండి బయటపడటానికి అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న బాలమృతం, ఫోర్టీఫైడ్ రైస్, కందిపప్పు,రాగిపిండి, గుడ్లు, పాలు, ఖర్జూరాలు, బెల్లం, వేరుసెనక చిక్కీలు, అటుకులు, ఆకుకూరలతో వండిన కూరలు పప్పు ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకొని పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న  ఆహారాన్ని తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలలో,  బాలింతలలో, పసిబిడ్డలను  అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. బాలల హక్కుల గురించి తల్లులకు అవగాహన కల్పించారు. పౌష్టికాహార లోపంతో తక్కువ బరువు ఉన్న 75 మంది చిన్నారులను గ్రోత్ మానిటరింగ్ ట్రాకింగ్ లో ఐసిడిఎస్ వారు గుర్తించిన ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే న్యూట్రిషన్ కిట్లను వరల్డ్ విజన్ స్వచ్చంద సేవా సంస్థ వారు అందించారు. ఈ సందర్భంగా వరల్డ్ విజన్ స్వచ్ఛంద సేవ సంస్థ వారికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అంగన్వాడి కార్యకర్తలు స్వయంగా తయారుచేసిన  వివిధ రకాల వంటకాలను ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అనంతరం స్థానిక భవిత కేంద్రం తనిఖీ చేసి పిల్లల రక్షణకు తగు చూచనలు సలహాలు ఇచ్చారు.ఈకార్యక్రమంలో కందుకూరు వరల్డ్ విజన్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ యెషయా, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ నిహారిక, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఇంటూరి పద్మావతి, మండల విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి, ఎంపీడీవో  వెంకటేశ్వరరావు, ఉలవపాడు సి డి పి ఓ  అరుణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుండి న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు,అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు,వరల్డ్ విజన్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)