విద్యార్థుల చదువులు ఏమాయే..?
రాజకీయ పార్టీ జెండాలు మోసేందుకు ఉపాధ్యాయులు పంపారా...?
అయ్యా.. జిల్లా విద్యాశాఖ అధికారి గారూ..విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోండి.
BSBNEWS - GUDLURU [ 21-09-2024]
కూటమి ప్రభుత్వం 100 రోజులు పరిపాలన అందించిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ తో జండాలు పట్టుకొని కేరింతలు కొడుతున్న దృశ్యం గుడ్లూరులో చోటు చేసుకుంది. తమ పిల్లలను చదువులు చదివించేందుకు బడికి పంపుతున్నామని, పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు మాత్రం మా పిల్లలను గాలికి వదిలేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారిని పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయం అని ఆ దృశ్యం చూసిన పలువురు ప్రశ్నిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి మండలంలో ఏం జరుగుతుంది అని పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్న ఎప్పుడో తూతూ మంత్రంగా పాఠశాలలను సందర్శించి వెళ్తారనే ఆరోపణ గుడ్లూరు మండలంలో వినిపిస్తుంది. అటువంటి తరుణంలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్ కే పరిమితం అవుతూ జిల్లాలో ఏం జరుగుతుందో అనే పర్యవేక్షణ పూర్తిగా లేకపోవటమే ఇందుకు నిదర్శనమని విద్యార్థి సంఘాలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా హెడ్ క్వార్టర్ ను వీడి జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేసేందుకు ముందుకు సాగాలని విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నారు.