శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు - ఎమ్మెల్యే ఇంటూరి

bsbnews
0

 శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు - ఎమ్మెల్యే ఇంటూరి

*కందుకూరు నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం - ఎమ్మెల్యే

BSBNEWS - KANDUKUR [23/09/24] 


కందుకూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత కల్పిస్తామని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచన మేరకు కందుకూరు పెద్ద బజారు నందు ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణం మండపం నందు ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాన్ని శనివారం రాత్రి కందుకూరు పోలీస్ వారు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశానికి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఎన్నికల ముందు తాను హామీ ఇచ్చిన ప్రకారం పట్టణంలో ఆర్యవైశ్య సోదరులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు అన్ని విధాలా తాను అండగా ఉంటానని అన్నారు. ఆర్యవైశ్యుల్లో తన మిత్రులు, తన ఆప్తులు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఆర్యవైశ్యునికి కష్టం వచ్చినా అది తన కష్టంలా భావించి వెంటనే దాని పరిష్కార మార్గానికి కృషి చేస్తానని అన్నారు. కందుకూరు పట్టణంలో ఎటువంటి దొంగతనం జరిగిన వెంటనే దానిని గుర్తించేందుకు అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలకు ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు అందించాలని కోరారు. గాయత్రి జ్యువెలరీలో జరిగిన దొంగతనం కేసులో  కష్టపడి దొంగలను పట్టుకున్న కందుకూరు సిఐ వెంకటేశ్వరరావును వారి సిబ్బందిని అభినందించారు.

కందుకూరు సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, పట్టణంలో నివసించే ప్రతి ఒక్కళ్ళు తమ విలువైన వస్తువులను భద్రపరుచుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు. సీసీ కెమెరాలు ఉండటంవలనే గాయత్రీ జ్యువెలర్స్ లో దొంగతనం చేసిన దొంగ దొరికాడని అన్నారు. కావున ప్రతి షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య  ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని కోరారు. ఒక శాసనసభ్యులు ఇలా సమావేశాలు నిర్వహించడం  చాలా గొప్ప విషయమని అన్నారు. పట్టణ ఎస్ఐ సాంబశివయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజలందరూ శాంతి భద్రతల విషయంలోనూ, ట్రాఫిక్ విషయంలోనూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. వి.పి.జి జ్యువెలర్స్ యజమాని వేముల సుకుమార్ గుప్తా సీసీ కెమెరాలు కోసం 50 వేల రూపాయల అందిస్తానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి గుడ్డ సంచులను పంపిణీ చేశారు. అంతకుముందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి సభా నిర్వాహకులు, ది బులియన్ మర్చంట్ అసోసియేషన్ వారు  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మురారిశెట్టి సుధీర్ కుమార్, కొత్తూరి సుధాకర్ రావు, కోటా కిషోర్, చక్కావెంకట కేశవరావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రెసిడెంట్ కోట నరసింహం, ది బులియన్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు, సెక్రెటరీ తుమ్మపూడి సురేష్, రామాలయం ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, వినాయక స్వామి ఆలయ ప్రెసిడెంట్ బొగ్గవరపు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ చీదెండ్ల పిచ్చయ్య తదితర ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)