హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి
కందుకూరు (ఉలవపాడు) సెప్టెంబర్ 21
BSBNEWS - ULAVAPADU [21/09/24]
ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఉలవపాడు ఎస్సై అంకమ్మ తెలిపారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఉలవపాడు లో బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత యువతకు తెలిపేలా అవగాహన కార్యక్రమంలో ఎస్సై అంకమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మన ప్రాణాలకే ముప్పని ఆయన అన్నారు. మన జీవితం మన ఒక్కరిదే కాదని మన కుటుంబంతో కలిసి ఉంటుందని మనం చేసే తప్పిదాలు వల్ల మన కుటుంబం నష్టపోకూడదని ఆయన అన్నారు. మైనర్ బాలికలకు వాహనాలను ఇచ్చి వారి భవిష్యత్తును అంధకారంలోకి తీసుకుపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానితో పాటు పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వారు చెప్పే ప్రతి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. లైసెన్సులు లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై జరిమానాలతోపాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.