కందుకూరు అభివృద్ధి కమిటీ లో కాంగ్రెస్ కి చోటు దూరమా...?

bsbnews
0

 కందుకూరు అభివృద్ధి కమిటీ లో కాంగ్రెస్ కి చోటు దూరమా...?

BSBNEWS - KANDUKUR [26.09.2024]

ఇటీవల గత రెండు రోజుల క్రితం స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో కాంగ్రెస్ పార్టీకి స్థానం కల్పించకపోవడంతో పలువురు కందుకూరు అభివృద్ధి కమిటీ పై కాంగ్రెస్ పార్టీ అభిమానులు తోపాటు పలువురు వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కందుకూరు అభివృద్ధి కమిటీ ఏర్పాటు జరిగిందని, ఆదిశగా పని చేస్తూ ముందుకు సాగుతామని, రాజకీయాలు ప్రస్తావిస్తే అభివృద్ధి కమిటీ నుండి వై దొలుకుతానని చెప్పిన మాజీ శాసనసభ్యులు దివి శివరాం అదే అభివృద్ధి కమిటీలో కాంగ్రెస్ పార్టీకి స్థానం కల్పించకపోవడంలో ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కాని ప్రశ్నగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. కేవలం అభివృద్ధి కమిటీ నామ మాత్రమేనా లేక పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టి కందుకూరు అభివృద్ధికి పనిచేస్తారా లేదా అన్న సందేహాలలో ప్రజలు ఉన్నారు. వారి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత కందుకూరు అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన దివి శివరాంపై ఉందని, ఆ దిశగా దివి శివరాం ఆలోచించి అభివృద్ధి కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా అడుగులు వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే అని కందుకూరు ప్రజలు తెలుపుతున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)