దామచర్ల కుటుంబానికి మచ్చ రాకుండా పనిచేస్తా
రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య
BSBNEWS - TANGUTUR
రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేయడంలో దామచర్ల కుటుంబం ముందుందని దామచర్ల సత్య అన్నారు. మండలంలోని ఢిల్లీ హైవే ఫంక్షన్ హాల్లో సోమవారం యోగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సత్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో కృషి, కష్టం, నిబద్ధతకు కచ్చితంగా ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వారసుడిగా ఆయన మనవడిగా ఎటువంటి మచ్చ రాకుండా పనిచేసే ప్రజల మన్ననలు పొందుతారన్నారు. దామచర్ల సత్య ను నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుడిగా భావించి అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ గా నియమించడం తనపై గురుతర బాధ్యత పెట్టినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా సాధించడం తో పాటు భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పనకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనన్ను చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఐటి కంపెనీలు స్థాపించి దేశంలోనే నంబర్ వంగ నిలిచేందుకు ప్రయత్నించారన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఐదు పోర్టులు, 14 ఫిషింగ్ హార్బర్ లతో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుందని దామచర్ల సత్య దీమా వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గం గత నాలుగుసార్లుగా రిజర్వాడు స్థానం నుంచి పోటీ చేస్తే మూడుసార్లు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా సూర్యప్రకాశ్ రావు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, తాతా ప్రసాద్ తోపాటు పలువురు హాజరయ్యారు.