పౌష్టికాహార మాసోత్సవాల్లో ఎమ్మెల్యే

bsbnews
0

 పౌష్టికాహార మాసోత్సవాల్లో ఎమ్మెల్యే

కందుకూరు (గుడ్లూరు) సెప్టెంబర్ 21

BSBNEWS - GUDLURU [21/09/24] 

స్థానిక అంగన్వాడి ఆధ్వర్యంలో శనివారం జరిగిన  పౌష్టికాహార మాసోత్సవాల్లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని గర్భిణీలకు సీమంతాలు ఏర్పాటు చేయగా వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లు పంపిణీ చేయడంతో పాటు సిబ్బంది తయారుచేసిన  వంటకాలను పరిశీలించి రుచి చూశారు. అదే ప్రాంగణంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అరుణ, వైద్యాధికారి మారుతీరావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసిల్దార్ స్వర్ణ, మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)