కేజీబీవీ విద్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

bsbnews
0

 కేజీబీవీ విద్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కందుకూరు (గుడ్లూరు) సెప్టెంబర్ 21 

BSBNEWS - GUDLURU [21/09/24] 



మండలంలోని మొగుళ్ళూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. 

విద్యాలయం ప్రాంగణంలో వంటగది, ఇతర రూములను, పారిశుధ్యాన్ని పరిశీలించారు. క్లాసురూములకు వెళ్లి సౌకర్యాలు ఎలా ఉన్నాయో  విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. 

విద్యాలయంలో 200 మందికి పైగా విద్యార్థినులు ఉంటున్నారని, ఈ ఏడాది కొత్తగా జూనియర్ కాలేజీ తరగతులు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ అమృత జ్యోత్స్న, ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఆహార పదార్థాలు శుచి శుభ్రతతో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు. విద్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు బయట వైపు లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయట జంగిల్ క్లియరెన్స్ చేయాలని సూచించారు. అవసరమైతే పంచాయతీ నుంచి నిధులు తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పలువురు నాయకులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)