జగన్మోహన్ రెడ్డిపై ఇంటూరి నాగేశ్వరరావు ఫైర్
BSBNEWS - KANDUKUR [26/09/24]
తిరుమల కొండపై కల్తీనెయ్యి వ్యవహారంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీటీడీ ఆచారాలు, భక్తుల నమ్మకాలతో ఆటలాడొద్దని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, టీటీడీ వ్యవస్థను గాడిలో పెట్టి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. పట్టణంలో కార్యక్రమానికి ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురు విక్కిరాలపేటరోడ్డులో ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి ముస్లింసోదరుల ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుంచి మసీదు వరకు, రోడ్డుకిరువైపులా షాపులు, ఇళ్లకు వెళ్లి ఈవందరోజుల్లో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. మసీదు దగ్గరనుంచి ఎమ్మెల్యేని గుర్రంపై, ప్రజా వేదిక నిర్వహించిన విజయ బాలాజీ కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్ అనూష, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసిల్దార్ ఇక్బాల్, సీఐ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని కమిషనర్ కు సూచించారు. రాబోయే వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా షేక్ అబ్దుల్ అజీజ్ ని నియమించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన సహకారంతో పట్టణంలో ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పారు. ముస్లింలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఇంటూరి హామీ ఇచ్చారు. తమ సమస్యలపై ప్రజలు ఎప్పుడైనా తన ఆఫీసుకు వచ్చి చెప్పుకోవచ్చని, 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టణంలో 1481 మందికి టిడ్కో ఇళ్ళు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లపాటు వాటి గురించి పట్టించుకోకుండా, ఎన్నికలకు ఆరు నెలలు ముందు లబ్ధిదారులకు ఇచ్చారని విమర్శించారు. కందుకూరులో 150 మందికి ఇళ్ళు రద్దు చేశారని, వారిలో అర్హులకు మళ్ళీ ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి సహకారంతో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తయారవుతుందని చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, చిత్తశుద్ధితో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరని, కూటమి ప్రభుత్వానికి తిరుగులేదని ఎమ్మెల్యే తెలిపారు. పౌష్టిక మాసోత్సవాల సందర్భంగా, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, ఉపాధ్యక్షుడు వడ్డెళ్ళ రవిచంద్ర, 7వ వార్డు టిడిపి అధ్యక్షుడు గౌస్ బాషా, పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ఘట్టమనేని హరిబాబు, ఉన్నం భాస్కర్, వార్డు నాయకులు రూబీ, షేక్ మున్నా, ఫిరోజ్, షేక్ సలాం, ఖాదర్ వలీ, ఖాదర్, ఖలీల్, హఫీజ్, భాషావలి, నజీర్, మసూద్, జహీర్, జమీర్, 6వ వార్డు అధ్యక్షుడు అహ్మద్ బాషా, జనసేన నాయకులు దండే శ్రీను ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.