నేటి నుండి పొలం పిలుస్తుంది
BSBNEWS - KANDUKUR [23/09/24]
ఈనెల 24వ తేదీ నుండి రేపటి నుండి కందుకూరు మండలంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వ్యవసాయ కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి వి రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం వారంలో రెండు సార్లు మంగళ, బుధ వారాలలో ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం లో జరుగుతుంది అని తెలిపారు. అందులో భాగంగా మొదటిగా 24 వ తేదీ మంగళవారం ఉదయం పలుకూరు గ్రామంలో, మధ్యాహ్నం మహాదేవపురం గ్రామాలలో, 25 వ తేదీ బుధవారం ఉదయం విక్కిరాలపేట గ్రామం, మధ్యాహ్నం కొండి కందుకూరు గ్రామాలలో జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖలు అయిన ఉద్యాన, పశుసంవర్ధక, మార్కెటింగ్, శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. క్షేత్రం స్థాయిలో, పొలాలను పరిశీలించి, రైతులకు తగు జాగ్రత్తలు, సూచనలు తెలియజేసి వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన అధిక దిగుబడులు పొందే విధంగా ఈ కార్యక్రమం వుంటుందని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.