చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ది నివ్వాలని పూజలు చేసిన వైసీపీ నాయకులు - కార్యక్రమాన్ని హాజరుకాని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, ముఖ్య నేతలు

bsbnews
0

చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ది నివ్వాలని పూజలు చేసిన వైసీపీ నాయకులు

కార్యక్రమాన్ని హాజరుకాని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, ముఖ్య నేతలు

BSBNEWS - KANDUKUR [28.09.2024] 

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా చంద్రబాబు నాయుడుకి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని స్థానిక జనార్దన్ స్వామి దేవస్థానంలో శనివారం వైసీపీ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం ప్రసాదమైన లడ్డు విషయంలో కల్తీ జరిగిందని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబునాయుడు ప్రవర్తిస్తున్నాడని ఆయనకి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. తిరుమల దర్శనానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. నిజనిర్ధారణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ వేసి చేయటం ఎంతవరకు న్యాయమని వారు తెలిపారు తమకు అనుకూలంగా రావాలని చంద్రబాబునాయుడు చేసిన పన్నాగమేనని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు షేక్ రఫీ, చీమల రాజా, ఆవుల మాధవరావు, గంగిరెడ్డి, తోకల కొండయ్య, ముప్పవరపు కిషోర్, పాశం కొండయ్య, రావులకొల్లు బ్రహ్మానందం, పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


*కార్యక్రమానికి  హాజరుకాని వైసీపీ సర్పంచులు, జడ్పిటిసి, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు* 


శనివారం జనార్దన్ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి దూరం గా ఉండటం కందుకూరులో చర్చనీయమైనది. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నియోజకవర్గ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ కార్యక్రమాలకు హాజరు కాకుండా వైసిపి నాయకులు చేత కార్యక్రమాలు తూ తూ మంత్రంలా నిర్వహించటంతో పాటు కార్యకర్తలకు ఆయన దూరంగా ఉండటమే అందుకు కారణమని వైసీపీలో పలువురు చర్చిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ పై పలువురు వైసిపి సర్పంచులు, ఎంపీటీసీలు అసహనంతో ఉన్నారని వైసీపీ కార్యకర్తలు తెలుపుతున్నారు. అందుకు నిదర్శనమే శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొనకపోవడమేనని తెలుస్తుంది. 



Post a Comment

0Comments
Post a Comment (0)