అంగన్వాడి ఆధ్వర్యంలో సీమంతాలు
ఆశీర్వదించిన ఎమ్మెల్యే
BSBNEWS - KANDUKUR [23.09.2024]
మండలంలోని మోపాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీమంతాలకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు పాల్గొని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంతో ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుందని వాటిని ప్రతి ఒక్కరు సభ్యులను చేసుకోవాలని అన్నారు. అంగన్వాడి ద్వారా అందించే బాలామృతం గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. గర్భవతులు తల్లుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యు ప్రభావతి, అంగన్వాడీ కార్యకర్తలు లలిత, లక్ష్మి, సుభాషిని, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.