విశ్వకర్మ యోజన మేనేజర్ ను సన్మానించిన విశ్వబ్రాహ్మణులు
BSBNEWS - ONGOLE [28.09.2024]
కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుదారులకు విశ్వకర్మ యోజన ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వారికి అవసరమైన పరికరాలను ఉచితంగా అందిస్తుంది. అందులో భాగంగా ఒంగోలు లో విశ్వకర్మ యోజనకు అప్లై చేసిన విశ్వ బ్రాహ్మణులకు ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా వారు విశ్వకర్మ యోజన మేనేజర్ బాబావలి, ట్రైనర్ దిలీప్ లకు కృతజ్ఞతా భావంతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ బాబావలి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు.