కోవూరులో ఘనంగా పోషణ్ మహా
BSBNEWS - KANDUKUR [25.09.2024]
మండలంలోని కోవూరు అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోర్షన్ మహా కార్యక్రమం సూపర్వైజర్ యు ప్రభావతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ శర్మిష్ట పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల ద్వారా గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహార అందిస్తుందని దానిని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని అన్నారు. పౌష్టికాహార లోపం లేని చిన్నారులు తయారు చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు అన్ని విధాల కృషి చేస్తున్నారని వారికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పౌష్టికాహారమైన ఏడు రకాల ఆహార పదార్థాలను తూచా తప్పకుండా గర్భవతిలో బాధితులు స్వీకరించాలని ఆమె కోరారు అనంతరం చిన్నారికి అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ విజన్ మేనేజర్ యాషియ, వరల్డ్ విజన్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయం డాక్టర్ లక్ష్మి నారాయణ, గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.