కందుకూరు ఆర్టీవో గా బాధ్యతలు చేపట్టిన టి.వి.ఎన్ లక్ష్మి

0

 కందుకూరు ఆర్టీవో గా బాధ్యతలు చేపట్టిన టి.వి.ఎన్ లక్ష్మి

BSBNEWS - KANDUKUR [12/9/24] 

కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా టి.వి.ఎన్ లక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుకూరు ఉన్న మోటారు వాహనముల తనిఖీ అధికారి వారి కార్యాలయమును రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంగా మార్చుటం జరిగిందని ఆమె తెలిపారు. ఆమె చిలకలూరిపేట నందు మోటార్ వాహనాల తనిఖీ అధికారిగా పనిచేస్తూ పదోన్నతి పై కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా రావడం జరిగినదని ఆమె తెలిపారు. ఇకపై కందుకూరు చుట్టుపక్కల వాహనదారులకు ప్రతి చిన్న పనికి జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మరిన్ని సేవలు అందించటం జరుగుతుందన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)