చంద్రబాబు నాయుడుకి ఆదేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి - బుర్రా మధుసూదన్

bsbnews
0

 చంద్రబాబు నాయుడుకి ఆదేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి - బుర్రా మధుసూదన్

BSBNEWS - KANDUKUR [26/09/24]


 చంద్రబాబు కి దేవుడు మంచి బుద్ధిని కల్పించాలి అని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో లడ్డును వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్తిచేసారని అబద్ధపు మాటలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా భాద్యతలు చంద్రబాబు నాయుడు చేపట్టిన తరువాత నెయ్యి లోడ్లు వచ్చాయని, కల్తీ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని అది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు టిటిడి లో మెంబర్ గా పనిచేసిన అనుభవం నాకు ఉందని ఎప్పుడు ఆ దేవస్థానంలో ఎటువంటి తప్పులు జరగవని ఎవరైనా తప్పులు చేయాలని చూస్తే ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. వందరోజుల పాలన లో చేసింది ఏమీ లేదని ప్రజలు తిరగబడతారని, ప్రజలను తప్పుదోవ పట్టించే దిశగా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయామ్ లో ఎప్పుడూ అతివృష్టి, అనావృష్టి తప్ప అభివృద్ధి ఏమి ఉండదని ప్రస్తుతం విజయవాడలో వచ్చిన అతివృష్టి అందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. సిబిఐ చేత విచారణ చేపట్టి నిజనిర్ధారణ చేయాలి కానీ, సిట్ పేరుతో తన ప్రభుత్వంలోని అధికారులుతో విచారణ చేపట్టి తనకి అనుకూలమైన విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి పై నేరం మోపాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)