వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే పొలం పిలుస్తోంది
BSBNEWS - PALUKURU [24/09/24]
కందుకూరు మండలంలోని పలుకూరు, మహాదేవపురం గ్రామాలలో మండల వ్యవసాయాధికారి వి రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలన్నింటిని ఒకే చోటికి తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని తెలియజేసారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎ. వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ పంట వేసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా , అన్ని పంటలను ఈ పంటలో నమోదు చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను, ఉద్యాన శాఖలో వున్న పథకాలు 50శాతం రాయితీతో యంత్ర పరికరాలు గురించి వివరించారు. అలాగే జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసులు మాట్లాడుతూ 90 శాతం రాయితీతో డ్రిప్, 50శాతం రాయితీ తో స్ప్రింక్లర్ రైతులకు అందుబాటులో ఉన్నాయి అని, కావలసిన రైతులు సంబధిత రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వెంకటేష్ మాట్లాడుతూ వరి, శనగ పంటలలో వచ్చు వివిధ తెగుళ్ల గురించి వివరించారు. అలాగే తప్పనిసరిగా ట్రైకోడెర్మ విరిడి తో విత్తన శుద్ధి చేసినచో శనగలో వేరు కుళ్ళు తెగులు అరికట్టవచ్చని తెలిపారు. తదుపరి పలుకూరులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పొడి నేలలో నేరుగా గొర్రు ద్వార విత్తిన రైతు డి.వెంకటేశ్వర్లు వరి పొలంను శాస్త్రవేత్తలు సమక్షంలో పరిశీలించి , తగు సూచనలు తెలియజేసారు. తదుపరి ప్రకృతి వ్యవసాయ అధికారిని వి సునీత మాట్లాడుతూ 10 నుండి 15 రకాల పప్పుదినుసులు రకాలను ప్రధాన పంటకు ముందు వేసుకొని కలియ దున్నటం వలన భూమిలో సేంద్రియ కార్బనాన్ని స్టిరీకరించవచ్చు అని తెలిపారు. ఈకార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వివేక్ ఆర్ కామత్, డ్వామా ఏపి డి. జె.బాబూరావు, కందుకూరు ఉద్యానవన శాఖ అధికారి పి.బ్రహ్మసాయి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్.ఖాసిం, ప్రకృతి వ్యవసాయ అధికారి డిఏంఏం పి.మాధవ, సిహెచ్. వెంకట్ రాజా, పలుకూరు గ్రామ ఉద్యాన శాఖ అధికారినీ ఐ.బ్రాహ్మీనీ , మహదేవపురం గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ నశీర్ భాష మరియు రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.