మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఇంటుూరి నాగేశ్వరరావు
BSBNEWS - VALETIVARIPALEM [14/9/24]
వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం తూర్పు వైపున జాతీయ రహదారిపై మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ మండలం శానంపూడి నుంచి వలేటివారిపాలెం మండలం శాఖవరం వైపు వెళుతున్న ఆటో, మొగిలిచర్ల నుంచి కందుకూరు వైపు వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు మహిళల ముఖాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆటో ఆపకుండా వెళ్లిపోవడంతో, అది గమనించిన కొంతమంది యువకులు ఆటోను వెంబడించి, డ్రైవర్ ను సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. అదే సమయంలో వలేటివారిపాలెం వైపు వెళుతున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గాయపడిన మహిళలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని ఆటో డ్రైవర్ ను గట్టిగా మందలించారు.