విఘ్నవినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - LINGASAMUDRAM [14/9/24]
శుక్రవారం రాత్రి లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు విఘ్నవినాయకుడిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. గ్రామస్తులంతా కలిసి మెలిసి కార్యక్రమం నిర్వహించడం పట్ల వారిని అభినందించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, కందుకూరు మండల అధ్యక్షులు నార్నె రోశయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.