షేక్ అబ్దుల్ అజీజ్ కి శుభాకాంక్షలు తెలిపిన రఫీ
BSBNEWS - KANDUKUR [24/09/24]
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ కి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ముందుకు వచ్చి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని చేతబట్టి పార్టీని అట్టడుగు స్థాయి నుండి ఘనమైన మెజార్టీతో ఎక్కువ స్థానాలు గెలిచే వరకు కష్టపడి తీసుకువెళ్లిన ఘనత అబ్దుల్ అజీజ్ ది అని అన్నారు. ఎన్నికల సమయంలో తన అవకాశాలను కూడా త్యాగం చేసి నెల్లూరు జిల్లాలో పార్టీకి ఇంతటి ఘనవిజయాన్ని సాధించి పెట్టిన అబ్దుల్ అజీజ్ కి గౌరవప్రదమైన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.