సమయపాలన పాటించని అధికారులు - ఎంపీడీవో, డిప్యూటీ డిఈవో ఇన్చార్జ్ లు అవ్వడమే అందుకు కారణమా...?

bsbnews
0

 సమయపాలన పాటించని అధికారులు 


ఎంపీడీవో, డిప్యూటీ డిఈవో ఇన్చార్జ్ లు అవ్వడమే అందుకు కారణమా...?

BSBNEWS - KANDUKUR [27.09.2024]

స్థానిక ఎంపీడీవో, డిప్యూటీ డిఈవో కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకుండా వారికి నచ్చిన సమయంలో కార్యాలయాలకు వస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. అందుకు నిదర్శంగానే 27వ తేదీ గురువారం ఉదయం 10:45 అయినా అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు రాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు దర్శనమిచ్చాయి. కందుకూరు మండలం నుండి అనేక గ్రామాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తుంటారు. అయితే కార్యాలయాల్లో మాత్రం ఖాళీ కుర్చీలు కనబడటంతో చేసేది ఏమీ లేక అధికారులు వచ్చే వరకు ఎదురుచూసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. అయినా  వచ్చిన రోజే సమస్య పరిష్కారం కాదని తిరిగి మళ్ళీ నాలుగైదు సార్లు రావాల్సిన అవసరం ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. 


డిప్యూటీ డిఈఓ కార్యాలయం


డిప్యూటీ డిఈఓ కార్యాలయంలో ఇన్చార్జిగా కావలి డిప్యూటీ డిఈఓ ను నియమించారు. అయితే ఆయన కందుకూరికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళతారు అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. కనీసం వారంలో మూడు రోజులైనా పాఠశాలల పర్యవేక్షణను చేయాల్సిన అవసరం ఉన్న ఆ దిశగా ఎక్కడ కనిపించకపోవడంతో డిప్యూటీ డిఈఓ నామ మాత్రమేనని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ ఉండదని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఎంఈఓ లతో పాటు డిప్యూటీ డిఈఓ మీద ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయకుండా కాలయాపన చేస్తుంటారని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఒకసారి ప్రభుత్వ కార్యాలయాల పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)