పార్లమెంట్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి

bsbnews
0

 పార్లమెంట్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి

BSBNEWS- NELLORE 


నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అరుదైన ఘనత దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు గురువారం బులెటిన్‌ విడుదల అయింది. పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ నుంచి సభ్యులను ఇందుకు ఎంపిక చేశారు. అందులో భాగంగా టీడీపీ తరఫున ఎంపీగా ఘన విజయం సాధించి నెల్లూరు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఎంపీ భత్రుహరి మహతబ్‌ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది, లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)