వినాయగదారులకు మెరుగైన సేవలు అందించాలి - ఏకేసిసి పిడి డాక్టర్ సయ్యద్ ఆసిఫ్ ఉద్దీన్
BSBNEWS - KANDUKUR
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయము పిడి డాక్టర్ సయ్యద్ ఆసిఫ్ ఉద్దీన్ అన్నారు. పట్టణంలోని ఓవిరోడ్ లో ఉన్న స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనంలో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ వర్క్ షాప్ కార్యక్రమములో వినియోగ దారుల అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, నెట్ వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ సంస్థ అయిన బి ఎస్ ఎన్ ఎల్ వైపుకు వెళ్లకుండా వినియోగ దారులు ప్రైవేటు సంస్థలు వైపు వెళ్తున్నారని నెట్ వర్క్ లో సమస్యల గురించి ప్రైవేటు సంస్థల సిబ్బందిని అడిగితే సమాధానం ఇవ్వడంలేదని చెప్పారు. ప్రభుత్వ సంస్థ నాణ్యమైన సేవలు అందిస్తే వినాయగదారులు సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యేక శ్రద్ధతో సమస్యను పరిష్కరించాలని తెలిపారు. సేవలకు సంభందించిన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డి ఈ, కందుకూరు డి ఈ, కందుకూరు ,ఉలవపాడు జె టి ఓ లు ,వినియోగదారుల పాల్గొన్నారు.