పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కొండేపి నియోజకవర్గ జనసేన నాయకులు
BSBNEWS - KONDEPI [28.09.2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన మెట్లను సంప్రోక్షం చేసి 11రోజుల పాటు చేస్తున్న ప్రాయచ్చిత్త దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ మెట్లను పసుపు నీళ్లతో కడిగి సంప్రోక్షం చేసి మెట్లకు పసుపు కుంకుమలతో స్వామివారి నామాలతో పూజ కార్యక్రమాలు శనివారం జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశంలోనే ప్రముఖ ప్రఖ్యాతలు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెస్తూ మహిమలు గల తిరుమల తిరుపతి దేవస్థానంలో లభించు లడ్డులో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అపపవిత్రం చేసినందుకుగాను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మతస్తులు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ కలియుగదైవం వెంకటేశ్వరస్వామి వారికి క్షమాపణలు చెబుతూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, గుడి చైర్మన్ పామర్తి మాధవరావు, కాసుల శ్రీనివాసులు, కిరణ్ బాబు, ప్రవీణ్, శివ, నాగేంద్రం, బ్రహ్మయ్య, అభి, శ్రీనివాస్, మధు, ఓమన్ రావు, రాధిక, మాధురి, ప్రమీల, రత్నకుమారి, రమణమ్మ, బుజ్జి, విజయ, తులసి, లక్ష్మి, మహి, మొదలైన జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.