స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాలల సందర్శించడం చాలా సంతోషం - సబ్ కలెక్టర్

bsbnews
0

స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాలల సందర్శించడం చాలా సంతోషం - సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ

BSBNEWS - KANDUKUR [25-09-2024]



స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ అన్నారు. పట్టణంలోని కోవూరు రోడ్డు నందు ఉన్న స్వర్ణ స్వయంకృషి దివ్యాంగుల  పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించారు.  ప్రతి విద్యార్థి వారి యొక్క మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని గురించి పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆమె విద్యార్థులను విద్యకు సంబంధించి, మరికొన్ని కుశల ప్రశ్నను అడిగి దివ్యాంగులు ఇచ్చిన సమాధానానికి ఆమె సంతోషించారు. పాఠశాల వంటగదిని, స్టాక్ రూమును  సందర్శించి దివ్యాంగులకు ప్రతినిత్యం ఆహారాన్ని గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ స్వర్ణ స్వయంకృషి దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు ప్రేమతో కూడిన మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు.  విద్యార్థులకు విద్యుతోపాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులను సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువుల కిట్లను పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డికి అందజేశారు. విద్యార్థులకు ఆమె స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేశారు. పాఠశాల వారి విజ్ఞప్తి మేరకు సబ్ కలెక్టర్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో కలసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు,డాక్టర్ చంద్రశేఖర్ గుప్తా,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)