కూటమి తరపున బాలినేనికి శుభాకంక్షలు తెలిపిన ఉమ్మడి పులిచర్ల సుబ్బారెడ్డి.
BSBNEWS - KANDUKUR
సీనియర్ నాయకులు,మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసుల రెడ్డి జనసేనలో చేరడం హర్షదాయకమని, శుభ పరిణామం అని, ఆయన చేరిక తో ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం అవుతుంది అనీ కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పులిచర్ల సుబ్బారెడ్డి ఒక పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇకముందు కూడా బాలినేని ప్రజాసేవ లో ముందుండాలని, వాసన్నను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని, ఆయనకి వృదయపూర్వక శుభాకంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.