పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం - కొర్రపాటి అనూష

bsbnews
0

పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం  - కొర్రపాటి అనూష 

BSBNEWS - KANDUKUR [21-09-2024]

మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష అన్నారు. పట్టణంలోని నాంచారమ్మ కాలనీ, యాదవపాలెం, 14, 15 వార్డులు, రైతు బజార్ వద్ద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను  మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణం దృష్ట్యా ప్రతి ఒక్కరు పారిశుధ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు. సీజను వ్యాధులు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుందని ఆమె అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరు సహకరిస్తే మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం లేకుండా చూస్తారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ చెత్తను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్తకుండీలలోనే వేయాలని తద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని ఆమె అన్నారు. రైతు బజార్ ఏరియాలో ఎక్కువ శాతం చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయని అలా వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రైతు బజార్ వద్ద ఎక్కువ మలమూత్ర విసర్జన చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)