పోతురాజు స్వామి సాక్షిగా ఇంటూరి నాశ్వరరావు తప్పు చేయడు

bsbnews
0

 పోతురాజు స్వామి సాక్షిగా ఇంటూరి నాశ్వరరావు తప్పు చేయడు

ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 

BSBNEWS - KANDUKUR [23/09/24] 





ఇది మంచి ప్రభుత్వం 3వ రోజు కార్యక్రమం కందుకూరు పట్టణంలో పోతురాజు మిట్ట ప్రాంతంలో జరిగింది. ముందుగా వార్డు నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పోతురాజు స్వామి గుడి వద్ద జరిగిన పూజా కార్యక్రమములో పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని పోతురాజు మిట్ట ప్రాంతంలో ఇంటింటికి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు, స్టిక్కర్లును  ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రత విషయంలో నాపై ఎవరు చెప్పినా నమ్మద్దని పోతురాజు స్వామి సాక్షిగా ఇంటూరు నాగేశ్వరరావు తప్పు చేయడని అన్నారు. 100 రోజుల ఎన్ డి ఏ పాలనలో  సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఒక్కోటిగా అమలుపరుస్తూ అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డీఎస్సీ, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,  వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను త్వరలోనే అమలు చేస్తామని, అక్టోబర్ నెలలో నూతన పెన్షన్లకు శ్రీకారం చుడుతున్నామని, దీపావళి పండుగ నుంచి ఉచితంగా మహిళలకు మూడు సిలిండర్లు పథకం అమలు చేయడానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గతంలో పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీన పరుచుకొని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదవారికి పట్టణంలో 2 సెంట్లు స్థలాన్ని, సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం  సుమారు 4.00 లక్షల రూపాయలు అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ సమస్యను 6 నెలలో ఈ ప్రాంతం నుంచి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతానికి తరలిస్తానని  హామీ ఇచ్చారు. సభానంతరం ప్రజల నుంచి శాసనసభ్యులు వారు నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని త్వరగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ కె.అనూష, తహసిల్దార్ ఇక్బాల్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరాస్వామి వార్డు నాయకులు మంగపాటి శ్రీనివాసరావు, వడ్డెళ్ళ రవిచంద్ర, బెజవాడ వెంకటేశ్వర్లు, షేక్ సలాం కోటపూరి శ్రీనివాసులు, నాయకులు చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, ముచ్చు శ్రీను, షేక్ రఫీ, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, వివిధ కమిటీల అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)